HomeTelugu Big StoriesSARIPODHAA SANIVAARAM Glimpse: కోపాన్ని క్రమబద్ధంగా చూపించే పిచ్చి నా కొడుకును చూశారా!

SARIPODHAA SANIVAARAM Glimpse: కోపాన్ని క్రమబద్ధంగా చూపించే పిచ్చి నా కొడుకును చూశారా!

SARIPODHAA SANIVAARAM Glimp

నేచ్యురల్‌ స్టార్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికి’ తరువాత వివేక్ ఆత్రేయ, నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి హైప్‌ ఉంది. DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియంక మోహన్ హీరోయిన్ గా నటించగా SJ సూర్య విలన్‌గా, సాయి కుమార్, శుభ లేఖ సుధాకర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ రోజు నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. ‘కోపాలు రకరకాలు.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమ బద్ధంగా పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకును చూశారా.. నేను చూశా’ అంటూ ఎస్‌జే సూర్య డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. నాని ఇంట్రడక్షన్ అదిరిపోయింది. చివరిలో సూర్యతో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ చెప్తాడు.

ఈ గ్లింప్స్‌ చూస్తుంటే ఇది కూడా అంటే సుందరాకి మూవీలా డిఫరెంట్‌ కాసెప్ట్‌లా అనిపిస్తుంది. దసరా తర్వాత మరోసారి మాస్ ఎలివేషన్లలో కనిపించబోతున్నాడు నాని. ఈ సినిమాకు జేక్స్ బేజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆగస్టు 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu