HomeTelugu Big Stories'అబ్బబ్బబ్బా.. అబ్బాయెంత ముద్దుగున్నాడే..' మహేష్‌ వెంటపడ్డ రష్మిక

‘అబ్బబ్బబ్బా.. అబ్బాయెంత ముద్దుగున్నాడే..’ మహేష్‌ వెంటపడ్డ రష్మిక

11 10
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న హీరో,హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని విడుదల చేశారు. వీటికి చక్కటి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం మహేష్‌‌-రష్మిక ప్రేమ గీతాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘అబ్బబ్బబ్బా.. అబ్బాయెంత ముద్దుగున్నాడే..’ అని సాగే ఈ గీతం ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇందులో ‘గీతా గోవిందం’ భామ చాలా అందంగా కనిపించారు. అంతేకాదు చక్కటి స్టెప్పులతో అదరగొట్టారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను మధుప్రియ ఆలపించింది.

‘ఎఫ్‌ 2’ తర్వాత అనిల్‌ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సంగీత, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్నా ఇందులోని ప్రత్యేక గీతంలో సందడి చేయబోతున్నారట. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu