సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11వ తేదిన విడుదల కాబోతున్నది. ఈ సినిమాను అనిల్ రావిపూడి పక్కా ఎంటర్టైనర్ గా తెరక్కించాడు. ఎంటర్టైనర్ అయినప్పటికీ మహేష్ బాబు నుంచి కోరుకునే అన్నిరకాల మసాలాలు సినిమాలు ఉన్నాయట. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా మేకింగ్ వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. షూటింగ్ మొత్తం కూడా చాలా సరదాగా జోక్స్ వేసుకుంటూ షూట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా సెట్స్ లో సీరియస్ గా ఉన్నట్టుగా కనిపించడం లేదు. హాయిగా సరదాగా సినిమాను కంప్లీట్ చేశారు.