హీరోయిన్ రష్మిక.. సినిమా సెట్‌లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంలోతనకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు స్ఫూర్తి అని అన్నారు. తాజాగా ఆమె మహేష్‌బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో మహేష్ ‘మేజర్ అజయ్ కృష్ణ’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌తోపాటు ‘మైండ్ బ్లాక్’, ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పాటలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ తరుణంలో రష్మిక ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు.
ఇందులో భాగంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్‌తో కలిసి పనిచేయడం గురించి తెలిపారు. ‘మహేష్ చాలా గొప్ప వ్యక్తి. ఆయన లాంటి సూపర్‌స్టార్‌తో కలిసి డ్యాన్స్ చేసేందుకు కొంచెం ఇబ్బంది, భయం వేసింది. చిత్రీకరణకు వచ్చే ముందు మాత్రమే ఆయన స్టెప్పులు నేర్చుకునేవారు. ఈ సినిమాలో ఓ పాటను చిత్రీకరణ సమయంలో.. పాటలో ఆదర్శవంతంగా కనిపించే విధంగా మహేష్ నన్ను ఎంతగానో ప్రేరేపించారు. సినిమా సెట్‌లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయంలో మహేష్‌బాబు నాకు స్ఫూర్తి’ అని రష్మిక తెలిపారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అలనాటి నటి విజయశాంతి కీలకపాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.