HomeTelugu Trendingసరిలేరు నీకెవ్వరు నుండి 'మైండ్‌ బ్లాక్‌' సాంగ్‌

సరిలేరు నీకెవ్వరు నుండి ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌

1 1
సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రచారపర్వాన్ని చిత్రబృందం వినూత్న రీతిలో ప్రారంభించింది. ప్రచారంలో భాగంగా డిసెంబర్‌ నెలలోని ప్రతి సోమవారం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి పాటలను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ‘మైండ్‌ బ్లాక్‌’ అంటూ సాగే పాటను ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు. అయితే, టీజర్‌ విడుదల చేసిన సమయానికే తొలిపాటను కూడా విడుదల చేయడం విశేషం. ఇటీవల నవంబర్‌ 22వ తేదీ సాయంత్రం 5.04 విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే పదిలక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్లింది. దీంతో టీజర్‌ విడుదల చేసిన సమయానికే పాటను కూడా విడుదల చేయనుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌ కు జంటగా రష్మిక నటిస్తున్నారు. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, మహేష్‌బాబు, అనిల్‌ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu