HomeTelugu Trending'సర్దార్‌' టీజర్‌ విడుదల

‘సర్దార్‌’ టీజర్‌ విడుదల

Sardar Telugu movie Teaser
త‌మిళ హీరో కార్తి నటించిన తాజా చిత్రం ‘స‌ర్దార్‌’‌. ‘అభిమ‌న్యుడు’ ఫేం పీఎస్‌.మిత్ర‌న్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.

కార్తి విభిన్న గెటప్స్‌లో కనిపించడం క్యూరియాసిటీని పెంచుతుంది. యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. కార్తి ఈ సినిమాలో డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు. రాశిఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించగా… లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్డూడీయోస్‌ సంస్థ విడుదల చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!