యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం, 7 ఆర్ట్స్ సరయు ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ యాడ్‌లో నటించిందంటూ ఆమెపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు ఆధారంగా సరయును నిన్న బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
సుమారు గంటన్నరకు పైగా ప్రశ్నించిన పోలీసులు సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీసు ఠాణాకు తరలించారు. కాగా 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో విడుదల చేసింది. అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు.
ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 153A, 295A సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.