HomeTelugu Trendingడేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన సారా అలీఖాన్‌

డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన సారా అలీఖాన్‌

2 1
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ నటించింది రెండు సినిమాలే అయినా తరచూ వార్తల్లో నిలుస్తోంది. తనతో కలిసి నటించిన కార్తిక్‌ ఆర్యన్‌తో ఈ భామ డేటింగ్‌లో ఉన్నట్లు కొన్నాళ్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా ఎట్టకేలకు ఆ గుసగుసలకు తెరదించింది. కార్తిక్‌తో డేటింగ్‌లో లేనని స్పష్టం చేసింది.

‘కార్తిక్‌ను సినిమా సెట్లో మాత్రమే కలిసేదాన్ని. ఒక్కసారి కూడా కలిసి బయటకు వెళ్లింది లేదు. మేమిద్దరం కలిసి ఉండటం చూడాలంటే మీరు సినిమా చూడాల్సిందే. అంతే తప్ప మరెక్కడా చూడలేరు. ఇలాంటి పుకార్లు రావడం ఇది తొలిసారి. ఇకపై రావని నేను చెప్పలేను. అయితే, నేనోంటో నాకు తెలుసు. లోపల ఒకలా బయటికి మరోలా ఉండాల్సిన అవసరం నాకు లేదు’ అని ఆమె స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. గతంలో కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సమయంలో.. కార్తిక్‌ అంటే తనకు ఇష్టమని సారా చెప్పింది. అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య ప్రేమవ్యవహరం నడుస్తోందని అంతా భావించారు. కాగా వీళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu