HomeTelugu Trendingసప్తగిరి కొత్త సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదల

సప్తగిరి కొత్త సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదల

Sapthagiri guduputani fir

టాలీవుడ్‌ నటుడు సప్తగిరి హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన ‘గూడుపుఠాణి’ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. కుమార్‌ కె.ఎం. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా సోలంకి హీరోయిన్‌గా నటించారు. ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌ నిర్మించిన ఈ చిత్రం టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని కృష్ణ విడుదల చేశారు. ‘‘కృష్ణగారు మా సినిమా టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేయడం హ్యాపీ’’ అని సప్తగిరి అన్నాడు. ‘గూడుపుఠాణి’ సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగుందన్నారు పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, కటారి రమేష్‌. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు’’ అన్నారు కుమార్‌ కె.ఎం. ఈ చిత్రానికి ప్రతాప్‌ విద్య సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu