కమెడియన్ సప్తగిరి ఫన్నీ దొంగగా నటిస్తున్న సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. అతని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి. ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ ‘నా దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న ‘వజ్ర కవచధర గోవింద’ అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. సప్తగిరి వ్యావహారిక శైలికి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా కథకు అనుగుణంగానే పవర్‌ఫుల్‌గా ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్ పెట్టాం’ అని అన్నారు. వైభవీ జోషి హీరోయిన్‌గా గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .