కన్నడ నటుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ’. ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్గా నటించింది. హేమంత్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి సైడ్-ఏ అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
తాజాగా ఈ సినిమా సెకండ్ పార్ట్ విడుదల తేదీ ప్రకటించారు. ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు.
ఇక ట్రైలర్ చూస్తే.. మను జైలు నుంచి విడుదలైన 10 సంవత్సరాల అనంతరం ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది.