HomeTelugu Big Storiesఊ అంటావా మావా అంటున్న దంగల్ హీరోయిన్

ఊ అంటావా మావా అంటున్న దంగల్ హీరోయిన్

Saanya Malhotra
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ గ్లోబల్ లిస్ట్‌లో ఈ పాట ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీలు ఈ పాటను అనుకరించారు. క్రికెటర్లు సైతం ఈ పాటకు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు.

ఊ అంటా మావా పాటకు దంగల్ హీరోయిన్ సాన్యా మల్హోత్రా తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అభిమానులతో పాటు అనేకమంది
బాలీవుడ్ సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu