Sankranthi Movies 2025:
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల హంగామా తప్పనిసరి. ఈ సీజన్‌లో థియేటర్లలో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఈ ఏడాది విడుదలైన మూడు ప్రధాన సినిమాలు ‘గేమ్ చేంజర్,’ ‘డాకు మహారాజ్,’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద తెగ పోటీ పడుతున్నాయి. మరి ఈ మూడు సినిమాలలో ఈ పండుగ విజేత ఎవరు అనే విషయం ఒకసారి చూద్దాం..
గేమ్ చేంజర్
రామ్ చరణ్ నటించిన ఈ సినిమా మీద.. బిరుదల కాకముందు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే చిత్రం విడుదలైన తర్వాత మాత్రం మొదటి షో నుంచే నెగటివ్ థాట్ వచ్చింది. పాటలు, స్టార్ కాస్ట్, గ్రాఫిక్స్ మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినప్పటికీ, ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. సంక్రాంతి సెలవుల్లో సైతం.. ఈ సినిమా కొన్నిచోట్ల మాత్రమే హౌస్‌ఫుల్ అయింది. వాణిజ్య వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం దిల్ రాజుకు 100 కోట్లకు పైగా నష్టాలను తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది.
డాకు మహారాజ్
బాలకృష్ణ నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించడంలో ఈ చిత్రం విఫలమైంది అనేది కొంతమంది వాదన. సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా నిర్మాతలకు లాభాలు అందించినప్పటికీ, బ్లాక్ బస్టర్ స్థాయిలో అయితే ఈ సినిమా నిలవకపోవచ్చు.
సంక్రాంతికి వస్తున్నాం
వెంకటేష్ నటించిన ఈ వినోదాత్మక చిత్రం పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌లో పూర్తి చెయ్యడం కారణంగా.. మరో పక్క ఈ చిత్రానికి మగతి రోజు నుంచే మంచి కలెక్షన్లు రావడంతో.. ఈ సినిమా మంచి సక్సెస్ వైపు పరుగులు తీసుకోండి. సంక్రాంతి పండగను మరింత ఆహ్లాదకరంగా మార్చేలా ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. మొత్తానికి అటు ఇటుగా ఈ చిత్రమే ఈ సంక్రాంతి విన్నారుగా నిలిచేలా కనిపిస్తోంది.
ప్రతీ సంక్రాంతికి సినిమా రిలీజ్‌లు ఉత్సాహాన్ని పెంచుతాయి. అయితే, ఈ ఏడాది పెద్దగా పోటీ లేకపోవడం, పెద్ద హిట్ సినిమాలు లేకపోవడం వల్ల.. ఈ సంక్రాంతి బాక్సాఫీస్‌ను ‘సో-సో’ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మూడు సినిమాల్లో చూస్తే మాత్రం.. మొదటి స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం, రెండో స్థానంలో డాకూ మహారాజ్ నిలవనున్నాయి. గేమ్ చేంజర్ మాత్రం రామ్ చరణ్ కెరియర్ లోనే ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలేవైపు అడుగులు వేస్తోంది.