Sankranthi Sentiment behind Game Changer failure:
సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్‌కు పెద్ద పీట వేస్తారు. కొంతమంది ప్రముఖులు సెంటిమెంట్స్‌ని నమ్మనని చెప్పినా, ఒక సినిమా సక్సెస్ అయితే దానికి సంబంధించిన అన్ని సంఘటనలను కలిపేస్తారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా జనవరి 10 తేదీ విషయంలో ఆలోచనలో పడిపోయారు.
2025 జనవరి 10న, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే పొలిటికల్ ఎంటర్‌టైనర్ రిలీజైంది. శంకర్ డైరెక్షన్‌లో వస్తుందనగానే భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, సినిమా రిలీజైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది.
సినిమా చూసినవాళ్లు శంకర్ మాజిక్ పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీకి స్క్రీన్‌ప్లే అవుట్ డేటెడ్ గా ఉందని, కొందరు సిల్లీ సీన్లతో విసిగిపోయామని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా, జనవరి 10కు మరో పెద్ద పరిచయం కూడా ఉంది. 2018 జనవరి 10న, పవన్ కళ్యాణ్ మైలురాయి సినిమా ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతి స్పెషల్‌గా రిలీజైంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా ఫెయిలయ్యాక జనవరి 10ని అభిమానులు చెడుదినం అని భావించారు.
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తో ఆ డేట్‌కి మంచి గుర్తింపు తెస్తారని ఆశించారు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తో మెగా ఫ్యాన్స్‌ను మళ్లీ నిరాశపరిచింది.
ఇది మొదటిసారి కాదు. 2019 సంక్రాంతికి, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమా కూడా భారీ అంచనాల నడుమ రిలీజై డిజాస్టర్‌గా మిగిలింది.
ఇక, 2024 సంక్రాంతికి కూడా మెగా ఫ్యామిలీకి పెద్దగా కలిసి రాలేదు. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘మట్కా,’ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఇప్పుడు అభిమానులు జనవరి 10 తేదీని నెగెటివ్ గా చూస్తున్నారు. కానీ, ఈ సెంటిమెంట్లను బ్రేక్ చేసే హిట్ సినిమా వస్తే మాత్రం అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు.
ALSO READ: India’s Most Expensive Car ఎవరి దగ్గర ఉందో తెలుసా?