HomeTelugu Trendingవిడకులు తీసుకోనున్న నటి సంజన్‌.. వైరల్‌

విడకులు తీసుకోనున్న నటి సంజన్‌.. వైరల్‌

Sanjjanaa galrani to take d

నటి సంజన గల్రాని ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొదట్నుంచి కూడా వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న సంజన.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఇదే చేయబోతుందని తెలుస్తుంది. 2020 లాక్‌డౌన్ సమయంలో డాక్టర్ అజీజ్‌ పాషాని సైలెంట్‌గా పెళ్లి చేసుకుంది సంజన. ఎవరికీ చెప్పకుండా.. ఏడడుగులు నడిచింది. అడిగితే అనుకోకుండా జరిగిపోయింది. తర్వాత పిలిచి పార్టీ ఇవ్వాలనుకున్నా కూడా కుదర్లేదు అంటూ సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు భర్త అజీజ్‌ పాషాతో విడిపోవడానికి ఈమె నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కేవలం పుకార్లు మాత్రమేనా.. లేదంటే ఈ వార్తలు నిజంగానే విడిపోతుందా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. వీటిపై మిశ్రమ స్పందన వస్తుంది. పెళ్ళై ఏడాది కూడా కాలేదు అప్పుడే విడాకులా!. తన భర్తతో ఎందుకు విడిపోవాలనుకుంటుంది.. అవన్నీ ఒట్టి వార్తలే అంటూ కొట్టి పారేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా సంజనకి, తన భర్తకి మధ్య అభిప్రాయబేధాలు తీవ్రస్థాయిలో వచ్చాయని.. అందుకే విడిపోవడానికి నిర్ణయించుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై నిజానిజాలు సంజన బయటికి వస్తే కానీ తెలియదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu