టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎప్పుడూ.. హిట్టే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ చిత్రం అంతకు మించిన విజయం సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో సినిమాను బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్లో అఫీఫియల్గా అనౌన్స్ చేసాడు. వచ్చే నెలలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్‌ను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో సంజయ్ దత్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట. త్వరలోనే సంజయ్ దత్‌ను కలిసి ఈ కథ వినిపించాలనుకుంటున్నారు. సంజూ బాబా ఓకే చెప్పడమే తరువాయి అంటున్నారు.ఇప్పటికే సంజయ్ దత్.. యశ్ హీరోగా నటిస్తోన్న కేజీఎఫ్ 2లో విలన్‌గా నటిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్లో తెరకెక్కిన ‘పానిపట్’ సినిమాలో విలన్‌గా మరోసారి నట విశ్వరూపం చూపించబోతున్నాడు.
ప్రస్తుతం బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ నెలాఖరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను వచ్చే సమ్మర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక టాలీవుడ్లో బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. గత పదేళ్లలో బాలయ్యను బోయపాటి అర్థం చేసుకున్నంతగా మరో దర్శకుడు ఎవరూ అర్థం చేసుకోలేదు. మొత్తానికి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు సంజయ్ దత్ ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.