Sanjay Dutt about Bollywood:
ప్రముఖ బాలీవుడ్ నటుడు Sanjay Dutt తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఈమధ్య సినిమాలలో విలన్ పాత్రలను పోషిస్తున్న సంజయ్ దత్ తాజాగా రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించారు.
భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది చిత్ర బృందం. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజయ్ దత్ సినిమా గురించి మాత్రమే కాక బాలీవుడ్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
“బాలీవుడ్ సినిమాల్లో హీరోయిజం పోయింది అది సౌత్ సినిమాల్లో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. హీరోయిజం, మాస్ అప్పీల్ అనేది భారతీయ సినిమాలకి మూలాలు. సినిమా చూడటానికి ప్రేక్షకులు ముంబై హైదరాబాద్ నుంచి మాత్రమే రారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, యూపీ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళు ఈలలు వేసే లాగా సినిమా ఉండాలి. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ని కోల్పోయింది. అదే ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కారణం” అని అన్నారు సంజయ్ దత్.
ఒకప్పుడు తామంతా అలాంటి సినిమాలే చేసే వాళ్ళమని.. ఇప్పుడు అలాంటివి రావడం లేదు అని అన్నారు Sanjay Dutt. ఆయన అన్నా మాటలలో కొంతవరకు వాస్తవం ఉంది. గతంలో ఉన్నట్లు మాస్ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. కానీ దానికంటే ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే ఈ మధ్యకాలంలో హిట్ అవుతున్నాయి.
ఎంత మాస్ సినిమాలు అయినా కూడా కంటెంట్ లేకుండా.. రొటీన్ టెంప్లేట్ తో ఉంటే ప్రేక్షకులు అస్సలు థియేటర్ల దాకా కూడా రావడం లేదు. ఏ ఇండస్ట్రీ అయినా మాస్ ఆపిల్ ఉన్న సినిమాలు.. కమర్షియల్ సినిమాలు వస్తూనే ఉంటాయి.. కానీ వాటిల్లో కూడా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే విజయాలను అందుకుంటున్నాయి. మరి డబుల్ ఇస్మార్ట్ సినిమా కేవలం మాస్ అప్పీల్ ఉన్న సినిమా కోవకి చెందుతుందా లేక కంటెంట్ ఉన్న సినిమా కోవకి చెందుతుందా చూడాలి.