సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు తెర తీసిన మీటూ ఉద్యమం, రోజుకో మలుపుతో, ఊహించని ట్విస్ట్‌లతో కంటిన్యూ అవుతుంది. హీరోయిన్ సంజన కొద్ది రోజుల క్రితం కన్నడ దర్శకుడు రవి శ్రీ వత్సపై కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందీ మర్డర్ మూవీని కన్నడలో రీమేక్ చేస్తూ ఆ సినిమాలో హీరోయిన్‌గా సంజనని తీసుకున్నారు. ఆమెకిదే ఫస్ట్ మూవీ. షూటింగ్ టైమ్‌లో డైరెక్టర్ తనతో ఎక్కువ ముద్దు, ఇంటిమేట్ సీన్స్ తీసాడని అమ్మడు ఆరోపించింది. ఇప్పుడు ఆ డైరెక్టర్‌కి సంజన సారీ చెప్పడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
మొదట సంజన ఆరోపణలు చేసిన తర్వాత, రవి కూడా కర్ణాటక ఫిలిం చాంబర్లో , ఆమె చేసిన ఆరోపణల వల్ల తన రెప్యుటేషన్ దెబ్బతిందని, ఆమెపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసాడు. దాంతో, కన్నడ పరిశ్రమ పెద్దలైనటువంటి అంబరీష్, రాక్‌లైన్ వెంకటేష్, రూప అయ్యర్ వంటి వారు, అంబరీష్ నివాసంలో సమావేశమయ్యారు. సంజన, రవిల తరపునుండి అన్ని విషయాలూ తెలుసుకున్న పెద్దలు, రవి తప్పేంలేదని తీర్మానించడంతో, సంజన తన తప్పొప్పుకుంటూ, దర్శకుడు రవికి క్షమాపణ చెప్పింది. తను పడ్డ ఇబ్బందిని మీటూ ద్వారా చెప్పాలనుకున్నాను కానీ, ఎవరినీ కించపరచాలని కాదని సంజన చెప్పింది.