సీనియర్ హీరోయిన్ లేటు వయసులో తల్లయ్యింది. టాలీవుడ్లో ‘సిందూరం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది కన్నడ బ్యూటీ సంఘవి. కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లరి పిల్లగా ఆకట్టుకుంది. ఆతరవాత బాలకృష్ణ , రాజశేఖర్ , వెంకటేష్ , చిరంజీవి , నాగార్జున, జగపతిబాబు ఇలా అప్పటి హీరోలందరితో నటించింది. తెలుగులో దాదాపు 45కు పైగా సినిమాలు చేసిన సంఘవి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘ఆంద్రవాల’ సినిమాలో నటించింది. ఆతర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. కానీ కొన్ని కన్నడ తమిళ చిత్రాల్లో మాత్రం నటించింది. ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని హాయి గా గడుపుతున్న సంఘవి తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సంఘవి వయసు 42 తాజాగా ఆమె తన పాపతో కలిసి ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటో రకరకల కామెంట్లు వస్తున్నాయి.