HomeTelugu Big Storiesతల్లి ఫిర్యాదుపై.. సంగీత క్లారిటీ

తల్లి ఫిర్యాదుపై.. సంగీత క్లారిటీ

2 12నటి సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని కుమార్తె బలవంతం చేస్తోందని ఆమె తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని దోచేయాలనే ఉద్దేశంతో సంగీత ఇలా చేస్తోందని ఆరోపించారు. దీంతో సంగీతపై నెగిటీవ్‌ పబ్లిసిటీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నటి సోషల్‌మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. భానుమతి ఖాళీ చెక్కులపై తనతో సంతకాలు చేయించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రియమైన అమ్మ.. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను పాఠశాలకు దూరం చేసి, 13 ఏళ్ల వయసు నుంచే పని చేయించినందుకు కృతజ్ఞతలు. నాతో ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించినందుకు థాంక్స్‌. మద్యం, డ్రగ్స్‌కు బానిసై, జీవితంలో ఏ రోజూ పనికి వెళ్లని నీ కుమారుడి సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు ధన్యవాదాలు. నీ నిర్ణయాలకు అడ్డు రాకుండా మన సొంత ఇంటిలోనే నన్ను ఓ మూలన ఉంచినందుకు కృతజ్ఞతలు. నేను పోరాడే వరకూ నాకు పెళ్లి చేయకుండా ఉన్నందుకు థాంక్స్‌. నన్ను, నా భర్తను నిరంతరం వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు ధన్యవాదాలు. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. చివరిగా.. నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్‌. నీకు తెలిసో, తెలియకో నన్ను నోరులేని అమ్మాయి నుంచి పోరాడే మహిళగా మారేలా చేశావు. ఇప్పుడు శక్తిమంతమైన మహిళగా అయ్యాను. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావు. ఏదో ఒక రోజు నీ పొగరు పక్కనపెట్టి, నన్ను చూసి కచ్చితంగా గర్వపడుతావు’ అని సంగీత భావోద్వేగంతో తల్లి చేసిన పనులు బయటపెట్టారు. సంగీత పలు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు. 2009లో ఆమె క్రిష్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2012లో ఆమెకు ఆడశిశువు జన్మించింది.

3 12

Recent Articles English

Gallery

Recent Articles Telugu