HomeTelugu Big StoriesSandeep Vanga: నాలుగేళ్లు బిజీ అంటున్న యానిమల్ డెరైక్టర్

Sandeep Vanga: నాలుగేళ్లు బిజీ అంటున్న యానిమల్ డెరైక్టర్

Sandeep Vanga to be busy for the next 4 years
Sandeep Vanga to be busy for the next 4 years

Sandeep Vanga upcoming movies:

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా మారిన Sandeep Vanga మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తర్వాత అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ అంటూ రీమేక్ చేసి.. అక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు. దీంతో వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా.. యానిమల్ అనే సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. వరుస సూపర్ హిట్లతో సందీప్ వంగ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సందీప్ తన తదుపరి సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు.

సందీప్ రెడ్డి నెక్స్ట్ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అన్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే ఆసక్తికరమైన టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని అన్నారు సందీప్ వంగా. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతుంది అని.. రెండేళ్లలో ఈ సినిమా విడుదల అవుతుంది అని రివిల్ చేశారు సందీప్ వంగ.

ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ వంగా యానిమల్ సినిమాకి సీక్వెల్ అయిన యానిమల్ పార్క్ మీద దృష్టి పెట్టనున్నారు. ఆ సినిమా పూర్తి చేయడానికి కూడా రెండేళ్లు పడుతుందట. ఈ రకంగా వరుసగా నాలుగేళ్లు బిజీగా ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు సందీప్ వంగా.

ఇక ఈ మధ్యనే అర్జున్ రెడ్డి సినిమా విడుదల ఏడేళ్లు పూర్తి అయిన సందర్భంగా.. అర్జున్ రెడ్డి ఫుల్ కట్ ను విడుదల చేయమని విజయ్ దేవరకొండ కోరగా.. సందీప్ వంగా పదేళ్లు పూర్తయిన తర్వాత తప్పకుండా చేద్దామని చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu