లాక్‌డౌన్ కారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.ఈ నేపధ్యంలో డైరెక్టర్‌లు వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది స్టోరీస్ సిద్ధం చేసుకుంటున్నారు. పూరి జగన్నాద్ కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగ కూడా వెబ్ సిరీస్ చేసే ప్లాన్‌లో ఉన్నాడట. అంతేగాక వెబ్ సిరీస్ తెలుగు హిందీతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సందీప్ బాలీవుడ్ లో కూడా క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే . అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది . దాంతో తన వెబ్ సిరీస్ ను కూడా హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట ఈ దర్శకుడు.