HomeTelugu TrendingSandeep Vanga మరొక స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నారా?

Sandeep Vanga మరొక స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నారా?

Sandeep Vanga in plans to team up with another star hero?

Sandeep Vanga Upcoming Movies:

టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో విడుదల కాబోతున్న తన దేవర: పార్ట్ 1 సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 27, 2024న థియేటర్లలోకి రాబోతోంది.

అయితే ట్రైలర్ లాంచ్‌ కు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ అర్జున్ రెడ్డి, ఆనిమల్ సినిమాలకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగాను కలిశారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ లో వైరల్‌గా మారింది. దీనితో ఎన్టీఆర్-సందీప్ కలయికలో కొత్త సినిమా వస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే, ఈ మీటింగ్ చాలా క్యాజువల్ గా జరిగింది అని.. ప్రస్తుతం వారి మధ్య ఎలాంటి ప్రాజెక్ట్ కి సంబంధించిన మాటలు లేవని సమాచారం. మరోవైపు Sandeep Vanga భవిష్యత్తులో అయినా ఎన్టీఆర్‌ కోసం ఓ సెన్సేషనల్ కథ రాయాలని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇది నిజం అవుతుందో లేదా అనేది చూడాలి.

ఇక దేవర సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu