దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా సవాలు విసిరారు. లాక్‌డౌన్ కారణంగా సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు సైతం ఇంటికి పరిమితమైయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటి పని, వంట పని చేస్తూ చాలా మంది కనిపించారు. తాజాగా సందీప్ రెడ్డి వంట సామాగ్రి తోముతూ, ఇల్లు శుభ్రం చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘పురుషుడు కూడా ఇంటి పనిని గొప్పగా చేయగలడు. నిజమైన పురుషుడు క్వారంటైన్ సమయంలోనూ ఇంటి భారాన్ని, పనిని పూర్తిగా మహిళపై వేయడు. దయచేసి ఇంటి పనిలో సాయం చేయండి. నిజమైన పురుషుడిలా ఉండండి. ఎస్.ఎస్. రాజమౌళి సర్.. మీరు కూడా ఇలాంటి వీడియోను అప్‌లోడ్ చేసి, అందరిలోనూ స్ఫూర్తి నింపాలని కోరుతున్నా’ అంటూ #BetheREALMAN ట్యాగ్‌ను ప్రారంభించారు.
సందీప్ రెడ్డి సవాలును రాజమౌళి స్వీకరించారు. ‘ఛాలెంజ్ స్వీకరిస్తున్నా సందీప్. ఇంటిలోని పనిని మనం కూడా పంచుకోవడం ఎంతో ముఖ్యం. నేను ఇంటి పనిచేస్తున్న వీడియోను రేపు అప్‌లోడ్ చేస్తా’ అని రిప్లై ఇచ్చారు.
Man can be a great domestic worker and a real man will never let his woman work all by herself specially during this No maid times & Quarantine.
Please help in domestic work 🙏🙏🙏#BetheREALMAN
I request @ssrajamouli sir to pass it on and inspire more by uploading a video 🙂 pic.twitter.com/Cqmq4xfRm7— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 19, 2020