HomeTelugu Newsసందీప్ కిషన్ రౌడీ బేబీ కాదు.. గల్లీ రౌడీ

సందీప్ కిషన్ రౌడీ బేబీ కాదు.. గల్లీ రౌడీ

Sandeep Kishan as Gully Row
సందీప్ కిషన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్‌ కథను అందించాడు. ఈ చిత్రానికి ముందుగా రౌడీబేబీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే కొన్ని కారణాలతో ఇప్పుడు దాన్ని గల్లీ రౌడీగా మార్చారు. టైటిల్ వీడియోను టాలీవుడ్ దర్శకులు పూరీ జగన్నాథ్, హరీష్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ కలిసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. టైటిల్ మాత్రమే మారిందని, ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఏమాత్రం తగ్గవని అన్నారు. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu