HomeTelugu Trendingబాలీవుడ్‌ బ్యూటీతో ప్రేమలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో‌!

బాలీవుడ్‌ బ్యూటీతో ప్రేమలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో‌!

Sandeep Kishan in love with

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రేమలో ఉన్నాడట. బాలీవుడ్‌ నటి సోనియా రాధేతో సందీప్‌ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్తలు వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. సందీప్‌, సోనియా కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలుసుకున్నారు. తక్కువ కాలంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారిందట. అంతేకాదు, ముంబై వీధుల్లో ఈ ఇద్దరూ షికార్లు కొడుతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అయితే ఈ ప్రేమ కథనాలపై అటు సందీప్‌ కానీ, ఇటు సోనియా కానీ ఇంకా స్పందించలేదు.

కాగా సోనియా ‘బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఆమె నటించిన ‘తారా వర్సెస్‌ బిలాల్‌’ త్వరలో విడుదల అవుతోంది. సోనియా మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్‌ కూడా! గతంలో ఆమె ప్రొడక్షన్‌ డిజైనర్‌గానూ పని చేసింది. అటు సందీప్‌ విషయానికి వస్తే అతడు చివరగా ‘గల్లీ రౌడీ’ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ ‘మైఖెల్‌’లో నటిస్తున్నాడు. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu