కన్నడ టీవీ నటి చందన (29)ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు తావరకెరెలోని లేఔట్ లో నివాసం ఉంటోంది ఈమె. పలు కన్నడ టీవీ సీరియల్స్, సినిమాలు, ప్రకటనల ద్వారా నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బెంగళూరులోనే నివాసం ఉంటున్న దినేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఐదేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. దినేష్ ను పెళ్లి చేసుకొని స్థిరపడాలని ఆమె అనుకుంది. అయితే ఐదేళ్లు చందనతో కలిసి ఉన్న దినేష్ పెళ్లికి మాత్రం నో చెప్పాడు. దినేష్ తల్లిదండ్రులు ఆమెను చాలామందితో తిరిగావు అని అవమానించడంతో మనస్థాపం చెందిన ఆమె సూసైడ్ నోట్ చేసి సెల్ఫీ వీడియో తీసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్షల రూపాయలు వాడుకున్నాడని… ఇప్పుడు నిరాకరిస్తున్నాడని వీడియోలో దినేష్ గురించి నిజాలు చెప్పింది. అనంతరం గ్లాసులో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దినేష్ ను అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.