HomeTelugu Big StoriesSamudra khani: ధనరాజ్‌ డైరెక్షన్‌లో సముద్రఖని మూవీ ఫస్ట్‌లుక్‌

Samudra khani: ధనరాజ్‌ డైరెక్షన్‌లో సముద్రఖని మూవీ ఫస్ట్‌లుక్‌

samuthirakani dhanraj ramam

Samudra khani: కోలీవుడ్ ప్రముఖ నటుడు, ద‌ర్శ‌కుడు సముద్రఖని గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. తండ్రైన, విలన్‌ అయిన పాత్ర ఎదైన దానిలో పరకాయ ప్రవేశం చేస్తాడు. తెలుగులో నటుడిగా పరిచమై ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు.

తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘రామం రాఘవం’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో టాలీవుడ్ న‌టుడు, జబర్దస్త్ ధనరాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు.

నేడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ఇక ఈ ఫ‌స్ట్ లుక్‌ను 22 మంది సినీ ప్ర‌ముఖులు విడుద‌ల చేయ‌డం విశేషం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గ‌మ‌నిస్తే.. తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు.

ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ కొరనాని తెలిపారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రామం రాఘవం’ తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu