R.K.S నిర్మాతగా మాస్టర్ అబ్రర్, మాస్టర్ రీహెన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా సెన్సిటీవ్. పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అంకితమై అందమైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మొబైల్ గేమ్ లలో లీనమై స్టూడెంట్స్ ఆత్మ హత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సరైన ఒక మెసేజ్ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలోని మొదటి పాట దోస్త్ మేరా దోస్త్ లిరికల్ సాంగ్ ను హీరో సంపూర్ణేష్ బాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ… పిల్లలకు చక్కటి సందేశం ఇస్తూ నిర్మించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా సక్సెస్ సాధించి చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆర్.కె.ఎస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చలాకి చంటి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఎంఎల్.రాజా ప్రాణవ్ దాశరధి సంగీతం అందిస్తున్నారు.