టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి ఓ రీమేక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నూతన దర్శకురాలు పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో సంపూర్ణేశ్ బాబు ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
తమిళంలో స్టార్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి ఇది రీమేక్. మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలుగా ఈ పొలిటికల్ ఎంటర్టయినర్ తెరకెక్కుతోంది. ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రం నుంచి సంపూర్ణేశ్ బాబు ఫస్ట్ లుక్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది.
ఫస్ట్ లుక్ చూస్తేనే సినిమా జానర్ ఏంటన్నది అర్థమవుతోంది. సంపూ ట్రేడ్ మార్క్ వినోదానికి లోటు ఉండదని స్పష్టం చేస్తోంది. ఈ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోందని చిత్రబృందం నేడు ప్రకటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది.