సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో మార్టిన్ లూథర్ కింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
మార్టిన్ లూథర్ కింగ్ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 27న రిలీజ్ చేయబోతున్నారు. పొలిటికల్ కామెడీ జానర్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో యోగిబాబు నటించిన మండేలా చిత్రానికి రీమేక్ అని అంటున్నారు.
రెండేళ్ల క్రితం క్యాలీఫ్లవర్ చిత్రంలో నటించిన సంపూర్ణేశ్ బాబు ఆ తర్వాత నటించిన సినిమా ఇదే. సీనియర్ నటుడు నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మిస్తున్నారు.