పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిన్న తన పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విషెస్ తెలిపిన సినీ సెలబ్రెటీలకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ చేసిన పోస్ట్ లు చాలా మంది నటులకు షాక్ ఇస్తున్నాయనే చెప్పాలి. తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ‘ఆర్ఎక్స్100’ హీరో కార్తికేయను ‘సార్’ అని తన పోస్ట్ లో అన్నాడు పవన్. దీనికి నేను మీ లక్షల మంది అభిమానులలో ఒకడిని. మీరు నన్ను సార్ అనడం ఏంటి సార్ అని మరో పోస్ట్ చేసాడు కార్తికేయ. ఇక హీరో సత్యదేవ్‌కు కూడా రిప్లై ఇచ్చాడు. అయితే పవన్ కు పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు చెప్పిన వారిలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ కూడా ఉన్నాడు. దానికి పవన్ ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. అయితే పవన్ రిప్లై పై స్పందించిన సంపూర్ణేష్ బాబు.. అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను” అని మరో పోస్ట్ చేసాడు.
అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍 https://t.co/UtVdEtukmD
— Sampoornesh Babu (@sampoornesh) September 3, 2020