బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతో టాలెంట్ ఉన్న సుశాంత్ అకాల మరణం వెనక బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం అనే కారణాలు వార్తలు వినిస్తున్నాయి. ఇక సుశాంత్ ది హత్య అని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పెద్దలను టార్గెట్ చేసి పలు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇక నెపోటిజంతో పాటు మరో వైపు డ్రగ్స్ వాడకం కూడా బాలీవుడ్ లో కలకలం రేపుతోంది.
ఇక నెపోటిజం పై ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తాజాగా హీరోయిన్ సమీరా రెడ్డి నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించినప్పుడు.. షూటింగ్ మధ్యలో ముద్దు సన్నివేశం గురించి చెప్పారని తెలిపింది. స్క్రిప్ట్ చెప్పినప్పుడు దీని గురించి చెప్పలేదుకదా అని తాను ప్రశ్నించగా… సినిమా నుంచి నిన్ను తప్పించడం పెద్ద విషయం కాదని దురుసుగా సమాధానమిచ్చారని చెప్పారని సమీరా రెడ్డి అంది. స్టార్ కిడ్స్ ను ప్రోత్సహించేందుకు తనకు రావాల్సిన మూడు సినిమాలు రాకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా నీతో కలిసి నటించడం చాలా బోరింగ్ అని ఓ హీరో డైరెక్ట్ గానే చెప్పేశాడని.. ఆ తర్వాత ఏ సినిమాలో తనను తీసుకోలేదని సమీర తెలిపింది.