HomeTelugu Trendingసమీరా రెడ్డి సమాధానం పై నెటిజన్ల విమర్శలు

సమీరా రెడ్డి సమాధానం పై నెటిజన్ల విమర్శలు

7 13బాలీవుడ్‌ నటి సమీరా రెడ్డి ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన కుమార్తె గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమీరా సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘బుధవారం డాక్టర్‌ వద్ద పరీక్షలు చేయించుకుని గురువారం యాడ్‌ షూటింగ్‌కు వెళ్లాను. అయితే నాకు సిజేరియన్‌ చేయాలని వైద్యులు చెప్పారు. శుక్రవారం తొలి ఏకాదశి కావడంతో ఆరోజు అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. ఆ పర్వదినాన మా ఇంట్లో ఆడపిల్ల అడుగుపెట్టింది. నాకు చాలా మంది నుంచి కానుకలు వచ్చాయి. బహుశా పాప కోసం ఇప్పట్లో షాపింగ్‌ చేయాల్సిన అవసరం లేదనుకుంటా’ అన్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాప ఎవరి పోలిక? అని విలేకరి అడిగిన ప్రశ్నకు సమీర ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. ‘పాప నాలాగా నల్లగా లేదు. తెల్లగా, ముద్దుగా ఉన్నందుకు సంతోషిస్తున్నా’ అన్నారు. అయితే పాప పోలిక గురించి అడిగితే రంగు గురించి చెప్పాల్సిన అవసరం లేదని పలువురు నెటిజన్లు, బాలీవుడ్‌ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu