HomeTelugu TrendingNBK109 Heroine: బాలకృష్ణ కోసం ముచ్చటగా మూడవసారి

NBK109 Heroine: బాలకృష్ణ కోసం ముచ్చటగా మూడవసారి

Same Balayya actress as NBK109 Heroine
Same Balayya actress as NBK109 Heroine

NBK109 Heroine:

వీర సింహా రెడ్డి, అఖండ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. NBK109 అని అభిమానులు ఈ సినిమాని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

l

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రజ్ఞా జైస్వాల్ ని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్ ఇప్పటికే బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అఖండలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు బాబి బాలయ్య సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా కనిపించనుంది.

ఇదిలా ఉంటే బాలకృష్ణ అఖండ పార్ట్ 2 కూడా తీయనున్నారు. అఖండలో ప్రగ్యానే హీరోయిన్ గా కనిపించింది కాబట్టి అఖండ 2 లో కూడా ప్రగ్య హీరోయిన్ గా కనిపిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో వరుసగా బాలకృష్ణతో మూడుసార్లు నటించే అవకాశం అందుకుంది ఈ భామ.

నిజానికి కంచె సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రజ్ఞ జస్వల్ కి పెద్దగా చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏమీ రాలేదు. అడపాదడపా సినిమాల్లో కనిపించింది కానీ ఆమె కెరియర్ మార్చేసే సినిమా అయితే ఇంకా పడలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఈమెకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు. మరి అది ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా భారీ అంచనాల మధ్య హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించిన మరిన్ని అప్డేట్లు త్వరలో బయటకు రానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu