స్టార్ హీరోయిన్, అక్కినేని నాగ చైతన్య పెళ్లి జరిగి రెండున్నరేళ్లు గడిచిపోయింది. పెళ్లైన ఆర్నెళ్ల నుంచే గుడ్ న్యూస్ ఎప్పుడూ అంటూ ఈ జంటను ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. చాలా ఇంటర్వ్యూల్లో సమంతను ఎప్పుడు తల్లికాబోతున్నారని ప్రశ్నించగా.. తెలివిగా సమాధానం ఇస్తూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది సమంత. ఇక్కడ కూడా అదే ప్రశ్న ఎదురైంది సామ్‌కి. ఓ నెటిజన్ మీరు ప్రెగ్నెంటా ..? అని ప్రశ్నించగా సమంత దానికి కొంటె గా సమాధానం చెప్పింది. 2017 నుంచే తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని, అయితే బయటకు రావడానికి బేబీ ఇష్టపడటం లేదని, ఈ బిడ్డ బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటోంది అంటూ పంచ్ వేసింది. తన చేతిపై ఉండే టాటూ గురించి చెపుతూ, అది తనకు, తన భర్త నాగ చైతన్యకు చాలా ప్రత్యేకమైనదని చెప్పింది.