HomeTelugu Trending'వెంకీ మామ' సినిమాలో సమంత.!

‘వెంకీ మామ’ సినిమాలో సమంత.!

9 8
టాలీవుడ్‌ ప్రముఖ నటుడు.. విక్టరీ హీరో వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీ మామ తెలిసిందే. ఎఫ్ 2 లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వెంకీ నుండి రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇటీవలే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా, నాగ చైతన్యతో రాశీ ఖన్నా రొమాన్స్ చేయనుంది. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో సమంత ఓ పాత్రలో చటుక్కున మెరవనుందనేది ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకీ మామ కథలో అతిథి పాత్ర అవసరం రావడం, దీనికితోడు ఆ పాత్ర కూడ కీలక సమయంలో రావడంతో సమంతను ఈ పాత్రకోసం తీసుకున్నారట. దీనికి తోడు సమంతను తీసుకుంటే సినిమాకు ఆమె క్రేజ్ కూడ సినిమాకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో సమంతను తీసుకున్నారట. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా పూర్తిగా వినోదభరితంగా రూపొందించారు. వెంకీమామ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన విడుదల విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu