HomeTelugu Big Storiesబుద్ధి ఉందా?.. జర్నలిస్టుకు సమంత కౌంటర్‌

బుద్ధి ఉందా?.. జర్నలిస్టుకు సమంత కౌంటర్‌

Samantha Visits tirumala

అక్కినేని వారి కోడలు సమంత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆమె బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. ‘మీ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి’ అంటూ ఓ జర్నలిస్టు ప్రశ్నను అడగబోతుండగా మధ్యలోనే సమంత చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. స్వామి వారి దర్శనం చేసుకుని వస్తున్న ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? బుద్ధి ఉందా? అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో సదరు జర్నలిస్టుకు దిమ్మతిరిగినంత పనయింది.

మరోవైపు సమంత ఇచ్చిన సమాధానం ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. సామ్ నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నామంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. ఎప్పుడు ఏమి అడగాలనే ఇంగితజ్ఞానం కూడా కొందరికి ఉండదని మండిపడుతున్నారు. ప్రస్తుతం సమంత సీరియస్ గా రియాక్ట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu