HomeTelugu TrendingSamantha Upcoming Movies: స్టార్ హీరోయిన్ కి తెలుగులో ఆఫర్లు లేక లేదా రాకా?

Samantha Upcoming Movies: స్టార్ హీరోయిన్ కి తెలుగులో ఆఫర్లు లేక లేదా రాకా?

Samantha Upcoming Movies
Samantha Upcoming Movies list disappoints Tollywood fans

Samantha Upcoming Movies: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత గత కొంతకాలంగా తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. నాగచైతన్య తో విడాకుల తర్వాత నుంచి సమంతా సినిమాల స్పీడు బాగా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. విడాకుల తర్వాత ఆరోగ్యపరంగా సమంత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో సినిమాలకి దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంది.

ఇప్పుడు సమంత ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆమె మాత్రం తెలుగులో సినిమాలు చేయడం లేదు. అయితే తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న సమంత బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు ఓకే చేస్తుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో సమంతా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్న రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే సమంత మరొక వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా సమంత ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న రక్త బీజ్ అనే వెబ్ సిరీస్ లో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు ఓకే చేస్తున్న సమంత తమిళ్ కూడా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తలపతి 69 సినిమాలో కూడా సమంత హీరోయిన్గా ఎంపికైంది హెచ్ వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సమంత కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నాలుగవ సినిమా ఇది.

ఇలా హిందీ తమిళ్లో వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్న సమంత తెలుగులో మాత్రం కనిపించడం లేదు. అయితే దీనికి కారణం సమంతా కి తెలుగు నుంచి ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు రాకపోవడం అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలు అందుకున్న సమంత తర్వాత చాలా వరకు ఫిమేల్ సెంటర్ కి సినిమాల్లోనే కనిపించింది. దీంతో కమర్షియల్ సినిమాలకి సమంత దూరమైపోయింది అని ఆమెకు అలాంటి సినిమా ఆఫర్లు రావడం తగ్గిపోయాయి. ఇక పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన సమంతా కి వేరే భాష నుంచి మంచి ప్రశంసలు అందాయి కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి నెగెటివిటికి మాత్రమే వచ్చింది. అందుకే సమంత నెమ్మదిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి దూరమైపోతుంది అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Samantha Upcoming Movies:

ఇక తెలుగులో సమంత చేస్తున్న ఒకే ఒక్క సినిమా మా ఇంటి బంగారం. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా పోస్టర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటిదాకా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న సమంత ఈ సినిమా తో ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu