Sobhita Dhulipala about Samantha:
టాలీవుడ్ నటుడు నాగ చైతన్య తన మొదటి భార్య సమంత రూత్ ప్రభుతో విడాకుల తర్వాత, రెండో వివాహం కోసం సిద్ధమవుతున్నారు. ప్రముఖ నటి శోభితా ధూళిపాళ తో ఆయన ఇవాళ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు.
నాగ చైతన్య, శోభితా ఇటీవలే ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో సమంత, 2018లో విడుదలైన గూఢచారి చిత్ర టీజర్‌ను ఆవిష్కరించినప్పుడు, శోభితా గురించి గొప్పగా చెప్పడం కనిపిస్తోంది. ఆ టీజర్ గురించి మాట్లాడుతూ సమంత “అద్భుతంగా ఉంది” అని ప్రశంసించారు.
View this post on Instagram
దానికి స్పందిస్తూ, శోభితా “సమంత చాలా మంచి వ్యక్తి. ఆమెను చూసి ఆనందం కలిగింది. మా సినిమాకి తను లక్కీ చార్మి అవ్వాలని అన్నారు. నేను కూడా సమంత నాకు లక్కీ చార్మి అవుతుందని అనుకుంటున్నాను” అని చెప్పింది శోభిత.
అసలు ఇండస్ట్రీలో ఎవరూ తెలియని సమయంలో సమంత ముందుకు వచ్చి శోభిత సినిమాని ప్రమోట్ చేసిందని.. కానీ ఆరేళ్ల తర్వాత శోభిత సమంతా భర్తనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయింది అని.. ఇది చాలా బాధాకరం అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా మరొకవైపు సమంతా నిజంగానే శోభితకి లక్కీ చార్మ్ అయింది అని.. సమంత ప్రమోట్ చేసిన గూడచారి సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాక.. సమంత తో విడాకుల తర్వాత నాగచైతన్య ని పెళ్లి చేసుకుంటూ శోభిత అక్కినేని వంటి పెద్ద కుటుంబానికి కోడలు అయింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: Mokshagna కోసం డైరెక్టర్ అవతారం లో బాలకృష్ణ?