Samantha to Keerthy Suresh: మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చాలా పద్ధతిగా కనిపిస్తారు. తొలి సినిమాలో మన పక్కింటి అమ్మాయిలా ఉందే అన్నట్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అయితే కొందరు ఛాన్స్‌ల కోసం డోస్ పెంచితే.. మరికొందరు ఛాన్స్‌లు రాక గ్లామర్ డోస్ పెంచేస్తారు. అలా ఇప్పటి వరకూ తమ రూల్స్ బ్రేక్ చేసిన హీరోయిన్‌లు చాలా మందే ఉన్నారు.
సమంత: 2010లో ‘ఏం మాయ చేసావె’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ సినిమాలో కాలేజీ స్టూడెంట్‌గా, చైతూ ప్రేమలో పడే అమ్మాయిగా కనిపించింది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా.. చీరలో చాలా మద్దతిగా కనిపించింది. ఆ తర్వాత క్రమంగా గ్లామర్ పాత్రలవైపు అడుగులు వేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఛాన్స్‌లు రావడంతో.. ఆమె గ్లామర్ షోలకు అదుపు లేకుండా పోయింది. బికినీలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.
కాజల్: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ సినిమాలో లంగావోణిలో పక్క పల్లెటూరి అమ్మాయిలా మెరిసింది. నో స్కిన్ షో. కానీ ఆ తర్వాత అందాల విందుతో రెచ్చిపోయింది. ఓ ఫోటో షూట్ న్యూడ్‌గానూ చేసి షాకిచ్చింది. ఇటీవల మ్యారేజ్ చేసుకున్న కాజల్.. రీఎంట్రీ కోసం మరింతగా డోస్ పెంచి షాకిచ్చింది. ఆఫర్ల కోసం స్కిన్ షో చేసి దుమారం రేపింది.
తమన్నా: ‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తమన్నా. ఇందులో చాలా పద్ధతిగా కనిపించింది. హోమ్లీ బ్యూటీగా మెరిసి అలరించింది. ‘హ్యాపీడేస్’లో కూడా స్టూడెంట్‌గా మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత వచ్చిన ‘కాళీదాసు’ నుంచి రెచ్చిపోయింది. ఇప్పటికీ అదే జోష్‌తో దూసుకుపోతుంది. ఇటీవల ‘అరణ్మనై 4’ లో నెవర్ బిఫోర్ అనేలా రెచ్చిపోయింది షాకిచ్చింది తమన్నా.
కీర్తిసురేష్: ‘నేను శైలజ’ లో హీరోయిన్‌గ ఎంట్రీ ఇచ్చిన ‘కీర్తిసురేష్’ చాలా ట్రెడిషనల్‌గా కనిపించింది. ఆతరువాత కూడా హోమ్లీ పాత్రలు చేస్తూ.. పక్కింటి అమ్మాయిలా గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’ మూవీతో సావిత్రి అంటే ఇలానే ఉంటుందేమో అనేంతగా మెప్పించింది. ఈ సినిమాకి గానూ జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. చాలా రోజులు ఎక్స్‌పోజింగ్, హాట్ సినిమాలకు దూరంగా ఉంది. కానీ ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావలంటే.. గ్లామర్ పాత్రలు చెయ్యక తప్పలేదు ఈ అమ్మడుకి. దీంతో `సర్కారు వారి పాట`తో డోస్ పెంచింది. ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లింది. ‘బేబీజాన్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె ఎక్స్ పోజింగ్ చేసి షాకిచ్చింది.
అనుపమా పరమేశ్వరన్: ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ వంటి సినిమాల్లో హోమ్లీగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనుపమా పరమేశ్వరన్. కానీ ఇటీవలే వచ్చిన ‘టిల్లు స్వ్కేర్’ సినిమాతో గ్లామర్ డోస్ పెంచేసింది. తన ఎక్స్ పోజింగ్, లిప్‌లాక్, హాట్ సీన్‌లతో రెచ్చిపోయి ఒక్కసారిగా ప్రేక్షకులకు షాకిచ్చింది. ఆఫర్లు రావాలంటే ఎక్కువ కాలం రాణించాలంటే మారాల్సిందే అని నిరూపించింది అనుపమా.
ఫరియా అబ్దుల్లా : ‘జాతిరత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా క్యూట్‌గా, ఇన్నోసెంట్‌గా కనిపించి ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో విజృంభించింది. అందాల విందులో నెక్ట్స్ లెవల్ చూపిస్తూ రాణిస్తుంది. సినిమా ఆఫర్ల కోసం తన వంతు అందాల విందు ప్రయత్నం చేస్తుందీ ఈ జాతిరత్నం.
పూజా హెగ్డే: ‘ముకుంద’ సినిమాలో పద్ధతిగా.. హాఫ్ శారీలో పడుచుపిల్లలా ఆకట్టుకుంది. కానీ ‘డీజే’ నుంచి డోస్ పెంచింది. ఆ తరువాత నుండి ఈ అమ్మడి గ్లామర్ డోస్‌కి హద్దు లేదు. ఆఫర్ల కోసం, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఇవన్నీ కామన్ అని చాటి చెబుతూనే ఉంది.
రష్మిక మందన్నా: టాలీవుడ్‌లో ‘ఛలో’ సినిమాలో కాలేజ్ అమ్మాయిలా క్యూట్‌గా కనిపించింది. గీత గోవిందం, దేవదాసు, డియర్ కామ్రేడ్.. సినిమాల వరకు చాలా పద్ధతిగా కనిపించింది. సరిలేరు నీకెవ్వరు మూవీతో కాస్త గ్లామర్ ట్రీట్ ప్రారంభించింది. ఆ తరువాత `పుష్ప`, `యానిమల్` చిత్రాలతో ఇండియన్ సినిమాలతో ఓరేంజ్‌లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీ అయిపోయింది. ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే.. ఇవన్నీ కామన్ అని చెబుతుంది రష్మిక.
మీరా జాస్మిన్: అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర వంటి చిత్రాల్లో చాలా పద్దతిగా మెరిసింది. ఆ తర్వాత కూడా అదే ట్రెండ్‌ని ఫాలోఅయ్యింది. వెస్ట్రన్ డ్రెస్సులు వేసినా ఎక్స్ పోజింగ్ చేయలేదు. ఇటీవలే రీఎంట్రీ సమయంలో మాత్రం ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసింది. అవకాశాల కోసం ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచేసింది. ఇప్పుడు ఒకటి అర ఆఫర్లతో సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంది.