టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత, పూజా హెగ్డే మధ్య రెండు రోజులుగా ఆసక్తికరమైన వార్ నడుస్తుంది. తనకు తెలియకుండా తన సోషల్ మీడియాలో ఎవరో హ్యాక్ చేసి సమంత గురించి పోస్ట్ పెట్టారని పూజా చెప్తుంది. మరోవైపు సమంత అభిమానులు మాత్రం తెలిసి చేసినా.. తెలియకుండా చేసినా కూడా అది నీ తప్పే.. కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ పట్టుబట్టారు. దీనిపై బుట్టబొమ్మ కూడా సైలెంట్‌గా ఉంది. ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సమంత కూడా ఈ ఇష్యూను చాలా లైట్ తీసుకుంది. తెలివితో డీల్ చేస్తుంది. తనను విమర్శించే వాళ్లకు అదిరిపోయే సమాధానం చెప్పింది.
చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో అదిరిపోయే పోస్ట్ పెట్టింది సమంత. ఇది చూసిన తర్వాత సమంతను విమర్శించే వాళ్లందరి బుర్రలు కూడా గిర్రున తిరగడం ఖాయం. ఎందుకంటే అలా ఇచ్చింది మసంత. తనను ద్వేషించే వాళ్లను చూస్తుంటే తనలో ఇంకా కసి పెరుగుతుందని చెప్పుకొచ్చింది. అదే పొగిడితే మాత్రం తాను బద్ధకస్థురాలిగా మారిపోతానని చెబుతుంది సమంత. అందుకే విమర్శించే వాళ్లే తనకు మేలు చేస్తారని ట్వీట్ చేసింది.
Unfortunately for you .. you don’t realise that you inspire me 😊 compliments make me lazy insults propel me to give my best work .. so Thankyou https://t.co/harKEksJsS
— Samantha Akkineni (@Samanthaprabhu2) May 29, 2020