HomeTelugu Trendingకొత్తరంగంలోకి అక్కినేని వారి కోడలు

కొత్తరంగంలోకి అక్కినేని వారి కోడలు

Samantha statement on her u
అక్కినేని వారి కోడలు, స్టార్‌ హీరోయిన్‌ స‌మంత ఇప్పుడు ఎడ్యుకేష‌న్ రంగంలోకి అడుగు పెట్టనుంది. కేవలం సినిమాల్లోనే గాక సామాజిక పరమైన అంశాల్లోనూ యాక్టివ్‌గా ఉంటూ ఇతర రంగాల్లోనూ రాణించేలా అడుగులేస్తోంది సమంత. త‌న ఫ్రెండ్స్, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి, ఎడ్యుకేష‌నిస్ట్ ముక్తా ఖురానాతో క‌లిసి ‘ఏక్కం’ అనే ప్రీ-స్కూళ్లను జూబ్లీ‌హిల్స్‌లో ప్రారంభించార‌ట స‌మంత‌. ఇప్పటికే ప్ర‌త్యూష అనే స్వ‌చ్చంద సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నారుల‌కు సహాయం చేస్తుంది అక్కినేని వారి కోడలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ప్రారంభం కానున్న ఈ స్కూల్ లాక్‌డౌన్ రాకుంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యేది. అయితే త్వరలోనే స్కూల్స్ ప్రారంభానికి అనుమతులు రాబోతున్నట్లు తెలుస్తుంది.”తల్లిదండ్రులను శక్తివంతం చేస్తూ ఈ పరీక్షా సమయంలో పిల్లలకు సరైన విజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా మా ఈ కొత్త ప్రయత్నం” అంటూ సమంత ట్వీట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu