సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సిరీస్ విడుదలకు ముందు తమిళ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది. కానీ తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటుడు మనోబాల స్పందించారు. ‘ది ఫ్యామిలీ మేన్-2’ సిరీస్ తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.
ఇలాంటి పాత్రలో నటించినందుకు సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పితీరాలి అంటున్నారు. రాజీ పాత్ర విషయంలో సమంతను చిత్రబృందం మోసం చేసింది. తమిళ ఈలం పోరాటాన్ని కించపరిచేలా చిత్రీకరించారని అన్నారు. ఇలాంటి కథను ఒప్పుకొనే ముందు సమంత ఆలోచించి ఉండాల్సింది. ఈ పాత్రలో నటించిన ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని అంటున్నారు. తమిళుల మనోభావాలను దెబ్బతీసిన చిత్రబృందం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.