HomeTelugu Big Storiesఒంటరిగా చనిపోవాలి అంటూ.. నెటిజన్‌ కామెంట్‌.. సమంత రిప్లయ్‌

ఒంటరిగా చనిపోవాలి అంటూ.. నెటిజన్‌ కామెంట్‌.. సమంత రిప్లయ్‌

Samantha ruth prabhu epic r

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యా​క్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్స్‌ని షేర్‌ చేస్తూ మోటివేషనల్‌ కొటేషన్స్‌ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్‌కు తన పెట్స్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకుంటూ మురిసిపోతుంది. తాజాగా వాటితో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసింది సమంత. ఇది చూసిన ఓ నెటిజన్‌ సామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అంటూ కామెంట్‌ పెట్టాడు.

ఇది చూసిన సామ్‌ వెంటనే అతడి కామెంట్స్‌పై స్పందించింది. ‘అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను’ అంటూ తనదైన శైలిలో ఇచ్చింది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్‌, ఫాలోవర్ష్‌ సదరు నెటిజన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అతడు తన కామెంట్‌ను డిలిట్‌ చేశాడు. అయినప్పటికి కొందరు దానికి స్క్రీన్‌ షాట్‌ తీసి రీట్వీట్‌ చేస్తున్నారు. అతడు సటైరికల్‌గా కామెంట్‌ చేసినప్పటికీ తను మాత్రం పాజిటివ్‌గా రిప్లై ఇచ్చిందంటూ సమంతపై నెటిజ​న్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం ఖుషి, యశోద చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది.

samantha

Recent Articles English

Gallery

Recent Articles Telugu