HomeTelugu TrendingCitadel: బాలీవుడ్ లో సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Citadel: బాలీవుడ్ లో సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Samantha remuneration for Citadel
Samantha remuneration for Citadel

Samantha remuneration for Citadel:

గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సమంత.. వరుస ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించిన సమంత.. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ అనే స్పై థ్రిల్లర్ సిరీస్ కి ఇండియన్ స్పిన్ ఆఫ్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. సిటాడెల్: హనీ బన్నీ అని టైటిల్ తో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ వెబ్ సిరీస్ టీజర్ చూస్తేనే దీనికోసం సమంత చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. పలు యాక్షన్ సన్నివేశాలలో కూడా సమంత నటించింది. దీంతో సామ్ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ పేరు ఉన్నప్పటికీ సమంత ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్ట్ కి 10 కోట్లు తీసుకున్న దాఖలాలు లేవు.

కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది. గతంలో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

వరుణ్ ధావన్, సమంత, కాకుండా ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్, సిమ్రాన్, సోహం మజుందర్, శివంకిత్ సింగ్ పరిహార్, కశ్వి మజుందర్, సికందర్ ఖేర్ తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu