స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స తీసుకోవడం కోసం సినిమాలకు సైతం బ్రేక్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం బాలిలో వెకేషన్‌లో ఉన్నట్టు సోషల్ మీడియాలో అప్‌డేట్ పెడుతూనే ఉంది. తన మేకప్ ఆర్టిస్ట్, స్నేహితురాలు అనూషతో కలిసి అక్క చిల్ అవుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతోంది.
ఈ మధ్య సమంత తన చికిత్స కోసం ఓ స్టార్ హీరో దగ్గర రూ.25కోట్లు అప్పు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత అది తప్పుడు వార్త అని కూడా అన్నారు. ఇప్పుడు ఈ విషయంపై సమంత క్లారిటీ ఇచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టింది.
“మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఎవరో మీకు తప్పుడు సమాచారన్ని ఇచ్చారు. మీతో తప్పుడు డీల్‌ను కుదుర్చుకున్నారు. నేను అందులో అతి తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్ అనేది వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య. ధన్యవాదాలు.. అంటూ తెలియజేసింది సమంత.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు దాన్ని మరింత షేర్ చేస్తూ సమంత ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.