స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత- అక్కినేని నాగచైతన్య ఏడాది క్రితం విడిపోయిన సంగతి తెలసిందే. ఆ తరువాత చైతన్య- నటి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్టు పలు సందర్భాల్లో వదంతులు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే వీరిద్దరూ ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫొటో కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో సమంత ఓ వార్తా సంస్థతో మాట్లాడింది. ‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనేది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’ అని సమంత ఘటూ వ్యాఖ్యలు చేసింది.
అంతకుముందు ఓ ఇంటర్య్వూలో సమంత తన విడాకుల గురించి ఓపెన్ అయ్యింది. డైవర్స్ తర్వాత తాను చాలా చీకటిలోకి వెళ్లిపోయానని పేర్కొంది. ఈ జంట తమ వివాహమైన నాలుగు సంవత్సరాల తర్వాత అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
విడాకులు తర్వాత తాను కోలువడానికి తనకు ఎంతో మంది సన్నిహితులు అండగా నిలబడ్డారని సమంత పేర్కొంది. కానీ తాను ఇప్పటికే ఆ చీకటి నుంచి ఇంకా బయటకు రాలేదని చెప్పింది. కానీ గతంలో ఉన్నన్ని బ్యాడ్ డేస్ ఇప్పుడు లేవని సమంత చెప్పుకొచ్చింది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు