HomeTelugu Trendingసమంత వీడియో పై టాలీవుడ్‌ స్టార్‌ల రియాక్షన్‌!‌

సమంత వీడియో పై టాలీవుడ్‌ స్టార్‌ల రియాక్షన్‌!‌

10 16స్టార్‌ హీరో సమంత తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. సమంతకు వ్యాయామం అంటే చాలా ఇష్టం. తన జీవనశైలిలో వ్యాయామాన్ని కూడా ఓ భాగం చేసుకున్నారు. ఇప్పటికే చాలాసార్లు వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫొటోలను షేర్‌ చేసిన సమంత తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయకండి .. మీ సామర్థ్యం ఏమిటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో చూసిన అభిమానులు, తారలు ఆశ్చర్యపోతున్నారు. ‘చాలా బాగుంది’, ‘సూపర్‌’, ‘అమేజింగ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదే సందర్భంగా పలువురు సినీతారలు కూడా సమంత వీడియోపై కామెంట్లు పోస్టుచేశారు.

నమ్రతా శిరోద్కర్‌: ‘అద్భుతం అద్భుతం‌’
కాజల్‌ అగర్వాల్‌: ‘అమేజింగ్‌’
పూజా హెగ్డే: ‘వావ్‌ దట్స్‌ క్రేజీ..!’
ప్రగ్యా జైశ్వాల్‌: ‘వావ్‌!! వండర్‌ ఉమెన్‌’
సుశాంత్‌: ‘మీరు చాలా స్ట్రాంగ్‌’ అంటూ నవ్వుతున్న ఎమోజీను పోస్టు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu