HomeTelugu Big Storiesనాగ్‌ బర్త్‌డే పార్టీలో సమంత పింక్‌ లుక్‌‌.. వైరల్‌

నాగ్‌ బర్త్‌డే పార్టీలో సమంత పింక్‌ లుక్‌‌.. వైరల్‌

8 28

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత మరోసారి తన సరికొత్త ఫ్యాషన్‌తో నెటిజన్ల చూపులు తన వైపునకు తిప్పుకొన్నారు. తన మామయ్య నాగార్జున పుట్టినరోజు వేడుక కోసం ధరించిన బార్బీ పింక్‌ డ్రెస్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అక్కినేని ఫ్యామిలీ ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. నాగ్‌ గురువారం తన 60వ పుట్టిన రోజును కూడా అక్కడే జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన బర్త్‌డే పార్టీలో సామ్‌ ప్రత్యేకమైన లుక్‌లో మెరిశారు. పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌, విలువైన కాస్ట్యూమ్స్‌ ధరించారు. ఆ లుక్‌లో ఉన్న ఫొటోలను నటి శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. వీటన్నింటి ధర రూ.2 లక్షలని సమాచారం.

సామ్‌ ఇటీవల ‘ఓ బేబీ” సినిమాతో హిట్‌ అందుకున్నారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌గ్రానీ’కి తెలుగు రీమేక్‌గా దర్శకురాలు నందినిరెడ్డి దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ ’96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu